Type Here to Get Search Results !

సేవా కార్యక్రమాల్లో చిట్కుల మహిపాల్‌రెడ్డి వైకుంఠ రథం అందజేత.. కుటుంబానికి రూ.లక్ష సాయం

 




సేవా కార్యక్రమాల్లో చిట్కుల మహిపాల్‌రెడ్డి

వైకుంఠ రథం అందజేత.. అనారోగ్యంతో మృతిచెందిన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

మనోహరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మనోహరాబాద్ మండలం, తూప్రాన్ మున్సిపల్ ప్రాంతాల్లో ఆయన పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.

చిట్కుల లక్ష్మి రాంరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండల కేంద్రానికి వైకుంఠ రథాన్ని అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఈ వైకుంఠ రథం ఉపయోగపడుతుందని తెలిపారు. అవసరమైన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా దీనిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

అనంతరం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వడియారం గ్రామానికి చెందిన మహేష్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని చిట్కుల మహిపాల్‌రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయంగా రూ.1 లక్ష నగదును అందజేశారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా చిట్కుల మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సేవలో భాగంగా ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ప్రజల కష్టాల్లో భాగస్వామిగా ఉంటూ, సాధ్యమైనంత మేరకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

వైకుంఠ రథం అందుబాటులోకి రావడంతో మనోహరాబాద్ మండల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు. అలాగే మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించి అండగా నిలిచిన చిట్కుల మహిపాల్‌రెడ్డిని స్థానికులు అభినందించారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంపీవో శ్రీనివాస్, సెక్రటరీ సంతోష్, వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు నాగరాజుగౌడ్, మరాఠీ నాగరాజు, రాము, శ్రీనివాస్‌రెడ్డి, గుజ్జ రఘు, మండల మైనారిటీ అధ్యక్షులు జావేద్ పాషా, ఉపసర్పంచులు వెంకటరెడ్డి, నవీన్, ధర్మేందర్, వెంకటేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మహేందర్, మున్సిపల్ అధ్యక్షులు నర్సింగ్, తప్పెట శ్రీనివాస్, శశిభూషణ్‌రెడ్డి, ఉమర్, అయిలయ్య, భిక్షపతి, చంద్రశేఖర్, రాజు, సాయి, సత్తయ్య, శంకర్, అనిల్, అప్సర్, రమేష్, నర్సింలు, యది, అజర్, నరసింహులు, రామస్వామి, కృష్ణారెడ్డి, కుమార్, సత్తి, సోములు, నెల్లూరు, భాస్కర్, కలీల్, శ్రీకాంత్, భూపాల్, దశరథ్, రవి, కృష్ణ, మహిపాల్ తదితర నాయకులు, కార్యకర్తలు, సీఎంఆర్‌ టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language