నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్
నర్సాపూర్, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):
నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు. డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, మెదక్ డివిజన్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఈ డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమం నిర్వహించారు.
కాగజ్మద్దు వద్ద ఉన్న మెరిడీ బయోకెమికల్ లిమిటెడ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నర్సాపూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, పాపిస్టా పౌడర్ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల మేరకు నిబంధనలను పాటిస్తూ ధ్వంసం చేశారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను నిబంధనల ప్రకారం భద్రపరిచి, సంబంధిత కమిటీ ఆదేశాల మేరకు డిస్పోజల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గులాం ముస్తఫా, శిక్షణలో ఉన్న అధికారి జ్ఞానేశ్వర్, ఎస్ఐ శరత్కుమార్, రామాయంపేట సీఐ నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
