Type Here to Get Search Results !

గర్భిణులకు అండగా ఆవుల రాజిరెడ్డి.. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

 


గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

ఆరోగ్య పరిరక్షణకు సేవా కార్యక్రమం.. న్యూట్రిషన్ కిట్లు అందించిన ఆవుల రాజిరెడ్డి

శివంపేట, సెప్టెంబర్ 12 (తెలుగు ట్రెండ్స్):
గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శనివారం శివంపేట మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండలంలోని పర్కిబండ, పోతారం, గౌతోజీగూడెం గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు ఉచితంగా న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, తల్లి ఆరోగ్యంతో పాటు కడుపులోని శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం కీలకమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పౌష్టికాహారం అందుకోలేని కుటుంబాలకు తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైద్యుల సూచనలను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందేలా కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందించడం అభినందనీయమన్నారు. సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న ఆవుల రాజిరెడ్డి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పోతారం సర్పంచ్ పుట్ట వినోద మహేందర్, పర్కిబండ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచ శ్రీరామ్, పిట్ల కృష్ణ, చెంది అర్జున్, డప్పు లక్ష్మణ్, గాంతి ఆంజనేయులు, గాంతి ఎల్లం, సదుల ప్రభాకర్, వెంకటేష్, శ్రీకాంత్, నవీన్‌తో పాటు గర్భిణీ స్త్రీలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language