Type Here to Get Search Results !

మున్సిపాలిటీ పేరుతో సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ చెల్లింపులపై అప్రమత్తంగా ఉండాలి


సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్ కమిషనర్ సాయికుమార్

నర్సాపూర్, సెప్టెంబర్ 22 (తెలుగు ట్రెండ్స్):
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ సేవల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజలకు ఫోన్ చేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్, ఇంటి పన్నులు, డబుల్ బెడ్రూం పట్టా సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలను ఉపయోగించుకుని ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఎవరికి ఫోన్ కాల్స్ చేయడం లేదని స్పష్టం చేశారు.

ఎవరైనా ఫోన్ చేసి మున్సిపాలిటీ పేరుతో డబ్బులు చెల్లించాలని కోరితే వెంటనే స్పందించకుండా, వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. తెలియని వ్యక్తులకు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మున్సిపాలిటీ సేవలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా పురపాలక సంఘం కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని కమిషనర్ సాయికుమార్ కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language