Type Here to Get Search Results !

బీవీఆర్ఐటీలో విదేశీ విద్యా సదస్సు.. ప్రపంచ యూనివర్సిటీల ప్రతినిధులతో విద్యార్థుల ముఖాముఖి

 


బీవీఆర్ఐటీలో విదేశీ ఉన్నత విద్యా సదస్సు

విదేశీ యూనివర్సిటీల ప్రతినిధులతో ముఖాముఖి.. పాస్‌పోర్ట్ మేళాకు విశేష స్పందన

నర్సాపూర్, సెప్టెంబర్ 22 (తెలుగు ట్రెండ్స్):
విదేశాల్లో ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బీవీఆర్ఐటీలో ‘విదేశీ ఉన్నత విద్యా సదస్సు–పాస్‌పోర్ట్ మేళా’ను ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫౌండేషన్ (జీఈసీఎఫ్) సమన్వయంతో బీవీఆర్ఐటీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సదస్సుకు జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, స్వీడన్ తదితర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు. పీఎఫ్‌హెచ్ యూనివర్సిటీ, నియోమా బిజినెస్ స్కూల్, షులిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ యూటా, కెక్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్, లండన్ సౌత్ బ్యాంక్ యూనివర్సిటీ, ఎమ్లియోన్ బిజినెస్ స్కూల్, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఎడిత్ కోవన్ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, యోంకోపింగ్ యూనివర్సిటీ, క్లార్క్‌సన్ యూనివర్సిటీ ప్రతినిధులు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు.

విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, ప్రవేశ అవకాశాలు, విదేశీ విద్యా విధానాలు తదితర అంశాలపై ప్రతినిధులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సదస్సు ద్వారా పలు అంశాలపై అవగాహన లభించింది.

ఈ సందర్భంగా బీవీఆర్ఐటీ డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు నర్సాపూర్‌కు వచ్చి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వారికి మరింత అవగాహన లభిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా నిర్వహించిన పాస్‌పోర్ట్ మేళాకు కూడా విశేష స్పందన లభించింది. పాస్‌పోర్ట్ ప్రాధాన్యం, దరఖాస్తు విధానం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్ డా. జె. బంగారాజు, జీఎస్‌ఏసీ కోఆర్డినేటర్ కె. ప్రణిత, విభాగాధిపతులు, డీన్లు, మేనేజర్ బాపి రాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language