Type Here to Get Search Results !

ఏడుపాయల వనదుర్గామాత ఆలయ హుండీకి కాసుల వర్షం.. 80 రోజుల్లో రూ.49.26 లక్షల ఆదాయం

 



ఏడుపాయల వనదుర్గామాత ఆలయ హుండీ ఆదాయం రూ.49.26 లక్షలు

80 రోజుల కానుకల లెక్కింపు

పాపన్నపేట, సెప్టెంబర్ 22 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయ హుండీ ఆదాయం రూ.49,26,228 వచ్చినట్లు ఆలయ ఈఓ మఠం వీరేశం తెలిపారు. మంగళవారం ఏడుపాయల గోకుల్ షెడ్‌లో 80 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆయన వెల్లడించారు.

హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టినట్లు ఈఓ తెలిపారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను సిబ్బంది లెక్కించారు.

ఈ లెక్కింపులో నగదు రూపంలో రూ.49,26,228 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 0.080 గ్రాములు, మిశ్రమ వెండి 0.768 గ్రాములు వచ్చినట్లు ఈఓ మఠం వీరేశం తెలిపారు.

హుండీ లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బ్రహ్మచారి, పల్లె సాయిబాబా, నరేష్, దీపక్ రెడ్డి, మహేష్, యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language