మెదక్ ఆర్టీసీ డిపోలో అవుట్సోర్సింగ్ డ్రైవర్ ఉద్యోగాలు
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. ఒరిజినల్ పత్రాలతో డీఎం కార్యాలయంలో సంప్రదించాలి
మెదక్, సెప్టెంబర్ 22 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ డిపోలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ పరమేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న వారికి తమ సొంత ప్రాంతంలోనే ప్రభుత్వ రవాణా సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఒరిజినల్ మెమో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలని సూచించారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది 18 నెలలు పూర్తయిన వారు అర్హులని తెలిపారు.
అభ్యర్థులు ఆఫీస్ టైమింగ్స్లో మెదక్ ఆర్టీసీ డిపో డీఎం కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని డిపో మేనేజర్ పేర్కొన్నారు.
ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 7660946864, 9494825746 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.,
