జోగిపేటలో గంగమ్మ ఒడికి గణపయ్య.. ఘనంగా నిమజ్జన శోభాయాత్ర
చిన్నారుల నృత్యాలు, కోలాటాలతో ఆకట్టుకున్న శోభాయాత్ర
అందోలు, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలోని పబ్బతి హనుమాన్ ఆలయంలో జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్రను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
ఈ సందర్భంగా అందోలు–జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డీబీ. నాగభూషణంతో పాటు పుర ప్రముఖులు చాపల వెంకటేశం, పి. సురోత్తం రెడ్డి, సార శివ కుమార్, పల్లె వెంకటరమణ, ఆనంద్ వర్ధన్, దిలీప్ జైన్, ఆకుల శంకర్, బిర్ల శంకర్, టి. హనుమంత్ కుమార్, అజిత్ కుమార్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్యకు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. గణపతి నామస్మరణలు, భక్తిగీతాలతో జోగిపేట వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
శోభాయాత్రలో చిన్నారి బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ప్రదర్శనలను స్థానికులు, భక్తులు ఆసక్తిగా తిలకించి అభినందించారు. భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్ర అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
