Type Here to Get Search Results !

పరికిబండలో ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు.. యువత బాధ్యతగా వ్యవహరించాలి: మాజీ సర్పంచ్ పూల అర్జున్

 


ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

యువత బాధ్యతగా వ్యవహరించాలి: మాజీ సర్పంచ్ పూల అర్జున్

మనోహరాబాద్, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మనోహరాబాద్ మండలం పరికిబండ మాజీ సర్పంచ్ పూల అర్జున్ సూచించారు. ఆదివారం పరికిబండ గ్రామంలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పూల అర్జున్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ఎలాంటి ఘర్షణలకు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు.

ముఖ్యంగా యువత ఉత్సవాల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని, ఇతరులకు ఇబ్బంది కలగకుండా పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.

గ్రామంలో ప్రజలంతా కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొంటూ, గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నరహరి, నాయకులు యాదగిరి, నవీన్, మల్లేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language