ఘనంగా స్త్రీల మైత్రి ఆరాధన ఉత్సవాలు
రామాయంపేట
, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
సీఎస్ఐ వెస్లీ సంఘం ఆధ్వర్యంలో స్త్రీల మైత్రి ఆరాధన ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నందిగామ, రాయలాపూర్ పాస్టరెట్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రెసిబిటర్ ఇంచార్జి రెవ. బి. కృపాకర్, ఇంచార్జి అమ్మగారు కరుణ కృపాకర్ ఆధ్వర్యంలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెవ. బి. జేమ్స్ రవీందర్ డేకెన్, సంఘ నాయకులు, స్త్రీల మైత్రి కార్యవర్గ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నందిగామ, రాయలాపూర్ పాస్టరెట్ పరిధిలోని స్త్రీల మైత్రి సెక్రటరీలు సునీత, బిజ్జ సంతోష, ఎండపల్లి నీరజ, స్థానిక అమ్మగారు రాధిక తదితరులు కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో సంఘ నాయకులు బిజ్జ సంజీవులు, బోడి స్టీవెన్, బిజ్జ ప్రభుదాస్తో పాటు ఎండపల్లి గ్రామ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్త్రీల మైత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆరాధన కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళల మధ్య ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం, పరస్పర సహకారాన్ని పెంపొందించేలా స్త్రీల మైత్రి కార్యక్రమాలు కొనసాగాలని సంఘ సభ్యులు ఆకాంక్షించారు.
