Type Here to Get Search Results !

రాజన్న టీ షాప్ ప్రారంభం.. మున్సిపల్ చైర్మన్‌తో కలిసి ప్రారంభించిన ఎంపీ రఘునందన్‌రావు

 


రాజన్న టీ షాప్‌ను ప్రారంభించిన ఎంపీ రఘునందన్‌రావు.. మున్సిపల్ చైర్మన్‌తో కలిసి ప్రారంభోత్సవం

నర్సాపూర్, సెప్టెంబర్ 25 (తెలుగు ట్రెండ్స్): నర్సాపూర్ పట్టణంలో మెదక్ వెళ్లే ప్రధాన మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజన్న టీ షాప్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్‌తో కలిసి టీ షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు టీ షాప్ నిర్వాహకుడు ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం మంచి అభివృద్ధి సాధించాలని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

మెదక్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై టీ షాప్ ఏర్పాటు చేయడంతో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు స్థానికులు టీ షాప్‌ను సందర్శించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ నాయకులు రమేష్ గౌడ్, టీ షాప్ నిర్వాహకుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language