Type Here to Get Search Results !

తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శం – తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన మహనీయుడు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్


 

తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శం

– తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన మహనీయుడు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

తెలుగు ట్రెండ్స్, అందోలు ప్రతినిధి:

తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. పదవుల కోసం రాజకీయాలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తన పదవినే త్యాగం చేసిన గొప్ప నాయకుడని అన్నారు.

1952లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అనంతరం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. 1967లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి తన త్యాగాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.

అధికారం, పదవుల కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని తన ఆచరణ ద్వారా బాపూజీ నిరూపించారని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం కొనసాగించిన ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి, ప్రజాసేవా భావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి జగదీశ్వర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులర్పించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language