Type Here to Get Search Results !

కూచిపూడి కళాక్షేత్రం ప్రారంభం – కళలు, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

 



కూచిపూడి కళాక్షేత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

తెలుగు ట్రెండ్స్, అందోలు ప్రతినిధి:

సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర టెంపుల్‌లో ఏర్పాటు చేసిన కూచిపూడి కళాక్షేత్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు మన సమాజానికి గొప్ప వారసత్వ సంపద అని అన్నారు. వాటిని పరిరక్షించడంతో పాటు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ముఖ్యంగా చిన్నారులు, యువతలో కళల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కళాక్షేత్రాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కూచిపూడి వంటి శాస్త్రీయ కళలకు సదాశివపేటలో మరింత ఆదరణ లభించేలా ఈ కళాక్షేత్రం మంచి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.

చిన్నారులు, యువత కూచిపూడి నృత్యంతో పాటు భారతీయ కళలను నేర్చుకుని తమ ప్రతిభను చాటుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కళల అభివృద్ధికి, కళాకారులను ప్రోత్సహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language