Type Here to Get Search Results !

కొల్చారంలో బొజ్జ గణపయ్యకు ఘన వీడ్కోలు.. కోలాటాలు, నృత్యాలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర

 



బొజ్జ గణపయ్యకు ఘన వీడ్కోలు.. భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర

శోభాయాత్రను ప్రారంభించిన ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్.. కోలాటాలు, నృత్యాలతో సందడి

కొల్చారం, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
కొల్చారం మండల కేంద్రంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శ్రీ హనుమాన్ వినాయక మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన బొజ్జ గణపయ్యకు ఏడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్రను కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ ప్రారంభించారు.

ఆకట్టుకున్న శోభాయాత్ర

శ్రీ హనుమాన్ కాలనీ వాసులు గణపయ్యకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. మహిళలు, యువత కోలాటాలు, నృత్యాలతో సందడి చేయగా.. యువకులు డీజే పాటలతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తుల భజనలు, గణపతి నామస్మరణలతో కొల్చారం వీధులు మార్మోగాయి.

“మళ్లీ రావయ్య గణపయ్య..”

“మళ్లీ రావయ్య గణపయ్య.. మా గండాలు తొలగించి, మా కోరికలు తీర్చావయ్య గణపయ్య” అంటూ భక్తులు గణనాథుడిని స్మరిస్తూ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. శోభాయాత్ర సందర్భంగా కొల్చారంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, పాండ్ర వెంకటేశం, తిమ్మనగారి ఆంజనేయులు, వనమాల అనిల్ శ్రీధర్, మనోహర్, అఖిల్, రితిన్, సత్యనారాయణ, తెనుగు శేఖర్, రామా గౌడ్, శేఖర్, సారా రామకృష్ణ, నరసింహులు, వడ్ల శివ, సుదర్శన్, దుర్గాప్రసాద్ గౌడ్, చెన్నయ్య, ఆనంద్, పాండ్ర శ్రీనివాస్, శ్రీశైలం, నాగరాజ్, ముత్యం శ్రీనివాస్, రాజు, వంశీ, సంపత్, శివ, లంబాడి శ్రీనివాస్, ప్రవీణ్, రామ్, కుమ్మరి నాగరాజ్, సంజీవులు తదితరులు, వినాయక కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language