అండాశయంలో భారీ సిస్ట్కు శస్త్రచికిత్స
4.5 కిలోల సిస్ట్ను విజయవంతంగా తొలగించిన దువా ఆసుపత్రి వైద్యులు
సంగారెడ్డి , సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన గీత అనే మహిళ అండాశయంలో భారీ సిస్ట్ (తిత్తి) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సంగారెడ్డి పట్టణంలోని దువా ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి, అండాశయంలో సుమారు 4.5 కిలోల బరువున్న సిస్ట్ ఉన్నట్లు నిర్ధారించారు.
దువా ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ రేష్మా బేగం ఆధ్వర్యంలో గీతకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. రోగి కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి, వారి అంగీకారంతో శస్త్రచికిత్స నిర్వహించారు.
శస్త్రచికిత్స ద్వారా అండాశయంలో ఉన్న 4.5 కిలోల సిస్ట్ను విజయవంతంగా తొలగించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మహిళ వైద్యుల పర్యవే
క్షణలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
భారీ సిస్ట్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంతో రోగి కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని వైద్యులు సూచించారు.
ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంలో వైద్య బృందం సమన్వయంతో పనిచేసిందని దువా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
