గణేష్ మండపం వద్ద ఘనంగా అన్నదానం
అన్నదాన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునీత రెడ్డి.. గణనాథునికి ప్రత్యేక పూజలు
నర్సాపూర్, సెప్టెంబర్ 21 (తెలుగు ట్రెండ్స్):
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 10వ వార్డు కౌన్సిలర్ బుల్లెట్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బుల్లెట్ రాజు ఎమ్మెల్యే సునీత రెడ్డిని సన్మానించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నహీముద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్, షేక్ హుస్సేన్, ఆనంద్ కుమార్, నాగరాజు గౌడ్, రింగుల ప్రసాద్, శ్రావణ్, రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
