Type Here to Get Search Results !

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్

 


కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్

ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ విమర్శలు.. విలేకరుల సమావేశంలో ఆరోపణలు

నర్సాపూర్, సెప్టెంబర్ 21 (తెలుగు ట్రెండ్స్):
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ విమర్శించారు. సోమవారం నర్సాపూర్‌లోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు బుల్లెట్‌ప్రూఫ్ ఏసీ బస్సుల్లో ఫామ్‌హౌస్ గేట్ల వరకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మల్లేష్ గౌడ్ ఆరోపించారు. “నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా” అన్నట్లుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులుగా ఉన్న కేసీఆర్, హరీశ్‌రావు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసని సురేష్, రాష్ట్ర నాయకులు పాపగారి రమేష్ గౌడ్, నాయకులు రాజేందర్, నారాయణరెడ్డి, ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షుడు నీలి నాగేష్, పట్టణ కన్వీనర్ ప్రేమ్ కుమార్ యాదవ్, అశోక్ సాదుల తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language