Type Here to Get Search Results !

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందాలి.. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

 


ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందాలి: జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు

అందోలు, సెప్టెంబర్ 21 (తెలుగు ట్రెండ్స్):
ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి సోమేశ్వరరావు సూచించారు. సోమవారం అందోలు మండలం నేరడిగుంట గ్రామంలో ఆయన పర్యటించి నిమ్మ, జామ, కూరగాయలు, పూల తోటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన ఉద్యాన పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, పంటల యాజమాన్య పద్ధతులు, దిగుబడి పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటలను సాగు చేస్తే రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.

సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌లో భాగంగా రైతు స్వర్ణలత నిర్మించుకున్న ప్యాక్‌హౌస్‌ను కూడా జిల్లా ఉద్యాన శాఖ అధికారి పరిశీలించారు. ప్యాక్‌హౌస్ వినియోగం, ఉద్యాన ఉత్పత్తుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందిస్తున్న వివిధ పథకాలు, రాయితీలను అర్హులైన రైతులు తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సోమేశ్వరరావు సూచించారు. ఉద్యాన పంటల సాగులో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు అందించేందుకు శాఖ తరఫున సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన శాఖ అధికారి సమత, హెచ్‌ఈఓ సంగయ్య స్వామి, రైతులు వెంకటేశం, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language