బీవీఆర్ఐటీలో ఐఈఈఈ కమ్యూనికేషన్స్ సొసైటీ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ ప్రారంభం
నర్సాపూర్, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): నర్సాపూర్లోని బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో ఐఈఈఈ కమ్యూనికేషన్స్ సొసైటీ (కామ్సాక్) స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ను మంగళవారం ఈఎల్ఎన్ సెమినార్ హాల్లో ఘనంగా ప్రారంభించారు. కమ్యూనికేషన్ టెక్నాలజీలు, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటెలిజెంట్ హార్డ్వేర్లను అనుసంధానిస్తూ విద్యార్థులకు సాంకేతిక అభ్యాసం, వృత్తిపరమైన నెట్వర్కింగ్, ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమలతో భాగస్వామ్యానికి వేదిక కల్పించాలనే లక్ష్యంతో ఈ చాప్టర్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ కార్యదర్శి, సిలికాన్ ల్యాబ్స్ ఇంజినీరింగ్ సీనియర్ డైరెక్టర్ శ్రీ ఎన్. వెంకటేష్, ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ స్టూడెంట్ యాక్టివిటీ కమిటీ చైర్ డా. వై. పద్మ సాయి, ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ కమ్యూనికేషన్స్ సొసైటీ చాప్టర్ కార్యదర్శి డా. విశ్వనాథం రావూరి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీవీఆర్ఐటీ డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, మేనేజర్ శ్రీ బాపి రాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ సురేష్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి డా. సంజీవ రెడ్డి, ప్రొఫెసర్ డా. ఎం.సి. చిన్నయ్య, ఐఈఈఈ కామ్సాక్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డా. కాలతిరిపి రాంబాబు, ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ కౌన్సిలర్ డా. బి. నరేష్ కుమార్, డిపార్ట్మెంట్ కో-ఆర్డినేటర్లు శ్రీమతి ఎం. అనూష, శ్రీ టి.పి. కౌసల్య నందన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
