జోగిపేట, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్):
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో యువత, మహిళలు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శోభాయాత్ర సందర్భంగా అందోలు-జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొని యువకులతో కలిసి డ్యాన్స్ చేశారు. దీంతో శోభాయాత్రలో సందడి నెలకొని, యువతలో ఉత్సాహం నిండింది. గణనాథుడి నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురోత్తంరెడ్డి, సారా శివకుమార్, కాలనీ ప్రముఖులు, మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిమజ్జన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.
