Type Here to Get Search Results !

పంచాయతీలకు నిధుల స్వేచ్ఛ.. సర్కార్‌ నిర్ణయంపై సర్పంచుల హర్షం


 

పంచాయతీ నిధులను నేరుగా ఖర్చు చేసే అవకాశం అభినందనీయం

నిధుల ఫ్రీజింగ్‌తో గతంలో ఇబ్బందులు.. కొత్త చట్టంతో గ్రామపంచాయతీలు మరింత బలోపేతం: రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యదర్శి అనూష భాస్కర్ యాదవ్

మనోహరాబాద్, సెప్టెంబర్ 11 (తెలుగు ట్రెండ్స్):
గ్రామపంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను అభివృద్ధి పనులకు నేరుగా ఖర్చు చేసుకునే అవకాశం కల్పించే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యదర్శి, మనోహరాబాద్ సర్పంచ్ చీర్ల అనూష భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీలు అభివృద్ధిలో మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

పంచాయతీ నిధులను నేరుగా ఖర్చు చేసుకునే అవకాశం కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చిత్రపటాలకు మండలంలోని సర్పంచులు శుక్రవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా అనూష భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ నిధుల ఫ్రీజింగ్ కారణంగా ఖాతాల్లో డబ్బులు ఉన్నా వాటిని అవసరమైన పనులకు ఖర్చు చేయలేని పరిస్థితులు ఉండేవని తెలిపారు. దీంతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు అందక ఇబ్బందులు ఎదురయ్యేవని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీల సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టం ద్వారా పంచాయతీ ఖాతాల్లోని నిధులను అభివృద్ధి పనులకు నేరుగా వినియోగించుకునే అవకాశం కల్పించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను ట్రెజరీకి మళ్లించకుండా పంచాయతీ తీర్మానం ద్వారా అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించడం శుభపరిణామమని అన్నారు.

ఈ నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు గ్రామపంచాయతీలు ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం అవుతాయని అనూష భాస్కర్ యాదవ్ తెలిపారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు.

రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి సర్పంచులంతా సమన్వయంతో పనిచేస్తామని, గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పోతారం సర్పంచ్ పుట్ట వినోద మహేందర్, రామాయపల్లి సర్పంచ్ జక్కుల సత్యనారాయణ, జీడిపల్లి సర్పంచ్ నర్సుగారి కృష్ణ, దండుపల్లి సర్పంచ్ మరాఠా నాగరాజు, జీడిపల్లి ఉపసర్పంచ్ పసుల రాజు యాదవ్, యువజన నాయకుడు మంచ శ్రీరామ్, నర్సింలు యాదవ్, స్వామి గౌడ్తో పాటు పలువురు సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language