Type Here to Get Search Results !

జీడిపల్లిలో మూగబోయిన 77 సీసీ కెమెరాలు.. గ్రామ భద్రతపై ఆందోళన, మరమ్మతులు చేపట్టాలని వేడుకోలు


 *జీడిపల్లిలో మూగబోయిన సీసీ కెమెరాలు*


*అప్పుడు దొంగతనాలు, అవాంఛనీయ ఘటనల నివారణకు ఏర్పాటు*


*ఇప్పుడు పట్టించుకునే నాథుడే కరువు*


*మరమ్మతులు చేపట్టి కెమెరాలను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తుల వేడుకోలు*


మనోహరాబాద్, (తెలుగు ట్రెండ్స్)


మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో దొంగతనాలు, అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గ్రామ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త జనవరి 2025లో గ్రామ భద్రత కోసం సొంత ఖర్చుతో 77 కెమెరాలను ఏర్పాటు చేయించారు.అప్పట్లో మెదక్ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కెమెరాలు పనిచేసిన సమయంలో గ్రామంలో జరిగిన పలు సంఘటనలను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా త్వరితగతిన ఛేదించిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం కెమెరాలు పనిచేయకపోవడంతో గ్రామంలో భద్రతపై ఆందోళన నెలకొంది.గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోతున్నా గ్రామ పాలకవర్గం, పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కెమెరాల ఏర్పాటు సమయంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై హడావుడి చేసినా.. ప్రస్తుతం వాటి నిర్వహణపై దృష్టి సారించే వారు లేకపోవడం బాధాకరమని అంటున్నారు.

గ్రామ భద్రతకు కీలకంగా మారిన సీసీ కెమెరాలకు వెంటనే మరమ్మతులు చేపట్టి తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.గ్రామ పెద్దలు,గ్రామ పాలకవర్గం, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కెమెరాల వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language