Type Here to Get Search Results !

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో లక్కీ డ్రా.. బంగారం, ఈవీ స్కూటర్ గెలుచుకున్న విజేతలు

 



విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో లక్కీ డ్రా.. విజేతలకు ఆకర్షణీయ బహుమతులు

రామాయంపేట, సెప్టెంబర్ 24 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. గత 14 సంవత్సరాలుగా కాలనీలో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తుండగా.. గత రెండేళ్లుగా రూ.999 గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా 5 గ్రాముల బంగారాన్ని మెదక్‌ పిల్లి కోటల్ కు చెందిన మెకానిక్ సందీప్ కుమార్తె ధనుశ్రీ గెలుచుకున్నారు. రెండో బహుమతిగా ఈవీ స్కూటర్‌ను భాను దక్కించుకున్నారు. మూడో బహుమతిగా 5 కిలోల లడ్డూను సూదం సతీష్ గెలుచుకున్నారు.

విజేతలకు వెంకటేశ్వర కాలనీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు బహుమతులను అందజేశారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దామోదర్ రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి నామస్మరణలతో వెంకటేశ్వర కాలనీ ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language