అక్టోబర్ 2న జర్నలిస్టుల ఆందోళనను విజయవంతం చేద్దాం.. ఐజెయూ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు మిన్పూర్ శ్రీనివాస్
పాపన్నపేట, సెప్టెంబర్ 24 (తెలుగు ట్రెండ్స్): దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయూ) ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 2న తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐజెయూ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు మిన్పూర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఐజెయూ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 2న జరిగే ఆందోళనలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మిన్పూర్ శ్రీనివాస్ కోరారు.
