దొమ్మాట శ్రీకాంత్ గౌడ్‌కు ‘సాహిత్య మిత్ర’ ప్రశంసా పత్రం
యువతలో చైతన్యం కలిగించే కవితకు గుర్తింపు.. ఘనంగా సత్కారం
చిలిపిచెడ్, మెదక్ జిల్లా, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
చిలిపిచెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన యువ కవి దొమ్మాట శ్రీకాంత్ గౌడ్‌కు ‘సాహిత్య మిత్ర’ ప్రశంసా పత్రం లభించింది. హైదరాబాద్ కూకట్పల్లి ప్రగతినగర్‌లోని సుందరయ్య భవన్లో భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి కవి సమ్మేళనం, ‘యుద్ధం మొదలయ్యింది’ కవితా సంకలన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్‌ను సాహితీ ప్రముఖులు ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
సమాజంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువత పెడదోవ పట్టకుండా చైతన్యం కలిగించే అంశాలపై శ్రీకాంత్ గౌడ్ రచించిన కవిత ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సామాజిక సమస్యలను కవిత్వం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతలో అవగాహన కల్పించేలా రచన చేసినందుకు ఆయనకు ‘సాహిత్య మిత్ర’ ప్రశంసా పత్రాన్ని అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని భవాని సాహిత్య వేదిక వ్యవస్థాపకులు వైరాగ్యం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అఖిల భారత స్థాయి కవి సమ్మేళనంతో పాటు ‘యుద్ధం మొదలయ్యింది’ కవితా సంకలన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సాహితీ ప్రముఖులు, కవులు పాల్గొని తమ రచనలు, కవితలను వినిపించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శతాధిక గ్రంథకర్త, తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డా. పి.ఎస్. రాములు, నేటి నిజం దినపత్రిక సంపాదకులు పైసా దేవదాసు, తంగేడు సాహిత్య మాసపత్రిక సంపాదకులు కాంచనపల్లి గోవర్ధన రాజు, ప్రముఖ సినీ గీత రచయిత, ఆంధ్రప్రదేశ్ బంగారు నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకట స్వామి నాయుడు, ప్రముఖ కవయిత్రి వనజ బలుసాని, తొలి మహిళా సినీ దర్శకురాలు నాగశ్రీ బాలధరి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. యువ కవులు సమాజంలోని సమస్యలపై స్పందిస్తూ తమ కలం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ వంటి యువ కవులు సామాజిక అంశాలను తమ రచనల్లో ప్రతిబింబిస్తూ సాహిత్య రంగానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేస్తూ సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినందించారు.
‘సాహిత్య మిత్ర’ ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తనను ప్రోత్సహించిన భవాని సాహిత్య వేదికకు, తనకు మార్గనిర్దేశం చేసిన గురువులకు, రచనా ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు తనలో మరింత బాధ్యతను పెంచిందని, సమాజానికి ఉపయోగపడే అంశాలపై భవిష్యత్తులోనూ రచనలు కొనసాగిస్తానని తెలిపారు.
శ్రీకాంత్ గౌడ్‌కు ‘సాహిత్య మిత్ర’ ప్రశంసా పత్రం లభించడంపై చిలిపిచెడ్ మండల ప్రజలు, జగ్గంపేట గ్రామస్తులు, యువకులు, సాహితీ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు, ప్రశంసలు అందుకోవాల
ని ఆకాంక్షించారు.

