Type Here to Get Search Results !

అందోలు నియోజకవర్గంలో మంత్రి దామోదర్ సుడిగాలి పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

 




అందోలు నియోజకవర్గంలో మంత్రి దామోదర్ సుడిగాలి పర్యటన

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.. విగ్రహావిష్కరణ, పరామర్శలు, గణేష్ మండపంలో పూజలు

అందోలు, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం అందోలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

అందోల్ మండలంలోని డాకూర్‌లోని సీఎస్‌ఐ చర్చిలో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వట్‌పల్లి మండలం ఉసిరికపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మన్నే నర్సింలు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నే నర్సింలుకు ఘన నివాళులర్పించారు.

అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల రాంరెడ్డిని మంత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పర్యటనలో భాగంగా మరవెళ్లి గ్రామంలో పార్టీ కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం శ్రీ సిద్ధివినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు.

మంత్రి వెంట పీసీసీ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, మండల పార్టీ అధ్యక్షులు విశ్వాస్, మాజీ అధ్యక్షులు రమేష్ జోషి, ఆత్మ కమిటీ చైర్మన్ కచుర్ రావు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు శేరి జగన్ మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, దిగంబర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, అల్లాదుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేషా రెడ్డి, పెద్దపట్ల వినయ్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language