Type Here to Get Search Results !

పోతారం గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. ఐక్యతతో అభివృద్ధికి కృషి చేయాలి

 


పోతారం గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

పోతారం, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):
పోతారం గ్రామంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలను వివరించారు. ప్రజల ఐక్యత, పోరాటాల ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఘట్టాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు.

గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని సర్పంచ్ తెలిపారు. తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా ఉండి గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమ్మడి దుర్గమ్మ, వార్డు సభ్యులు మంద యాదగిరి, మన్నె సురేష్, చెలిమెల పవన్ గౌడ్, సంకీ శ్రీకాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రజిత, సీఏ దుర్గం కవిత, ఫీల్డ్ అసిస్టెంట్ కత్తి నరసింహులు పాల్గొన్నారు.

అలాగే గ్రామ ప్రజలు వడ్ల సత్య, చెలిమెల మల్లేష్ గౌడ్, పుట్ట కుమార్, మాస్కురి శ్రీనివాస్, పంజాల నాగరాజు గౌడ్, సంకీ లక్ష్మణ్, తలారి శ్రీకాంత్, చెలిమెల రాకేష్ గౌడ్, తలారి ప్రశాంత్, చెలిమెల ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, అభివృద్ధి, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language