Type Here to Get Search Results !

పాత లింగాయిపల్లిలో సామూహిక అగ్నిహోత్రం





పాపన్నపేట, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):

పాపన్నపేట మండల పరిధిలోని పాత లింగాయిపల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాస్తమయ సామూహిక అగ్నిహోత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటి సమస్యల నేపథ్యంలో ప్రాచీన వేద విజ్ఞానంగా పేర్కొనే అగ్నిహోత్రంపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సుమారు 10 నిమిషాల పాటు అగ్నిహోత్రాన్ని నిర్వహించే విధానాన్ని నిపుణులు పాల్గొన్న వారికి ప్రత్యక్షంగా వివరించారు.


రాగి పిరమిడ్, ఎండిన ఆవుపేడ బిళ్లలు, నెయ్యి, అక్షింతలను ఉపయోగించి అగ్నిహోత్రం నిర్వహించే పద్ధతిని ప్రదర్శించారు. అనంతరం అగ్నిహోత్రం, సేంద్రీయ వ్యవసాయం, నీటి వనరుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.


అగ్నిహోత్రం ద్వారా పర్యావరణం, మానసిక ప్రశాంతతకు ప్రయోజనం కలుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అగ్నిహోత్రంపై ప్రతి ఇంటికీ అవగాహన కల్పించడమే విశ్వ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు.


కార్యక్రమంలో సర్పంచ్ బంజ శ్రీశైలం అప్పతో పాటు గ్రామ ప్రజలు, విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language