Type Here to Get Search Results !

బ్రాహ్మణపల్లిలో ఘనంగా వినాయకుడి లడ్డూ వేలం రూ.30 వేలకు లడ్డూను దక్కించుకున్న ఆకుల నర్సింలు

 


బ్రాహ్మణపల్లిలో ఘనంగా వినాయకుడి లడ్డూ వేలం

రూ.30 వేలకు లడ్డూను దక్కించుకున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల నర్సింలు

తెలుగు ట్రెండ్స్, నర్సాపూర్: నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గరుడ సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలంపాట సోమవారం రాత్రి ఉత్సాహంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గరుడ సేన యూత్ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూకు గ్రామంలో మంచి డిమాండ్ ఏర్పడింది.

ఈ సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు లడ్డూను దక్కించుకునేందుకు వేలంలో పాల్గొనగా, చివరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల నర్సింలు రూ.30 వేల ధరకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు.

వేలంపాట అనంతరం నిర్వాహకులు ఆకుల నర్సింలును అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తి, ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. వినాయకుడి లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని గరుడ సేన యూత్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆనంద్, గరుడ సేన యూత్ సభ్యులు, గ్రామ యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language