Type Here to Get Search Results !

ఉపాధిహామీ కూలీలకు ఆర్థిక అక్షరాస్యత.. సైబర్ మోసాలపై అవగాహన

 


కూలీలకు ఆర్థిక అక్షరాస్యత పాఠాలు

సంపాదనతో పాటు పొదుపు ముఖ్యం.. మోసపూరిత కాల్స్‌తో జాగ్రత్త!

వెల్దుర్తి, సెప్టెంబర్ 21 (తెలుగు ట్రెండ్స్):
ఉపాధిహామీ కూలీలకు బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్కపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆర్బీఐ ఆధ్వర్యంలో డిపాజిటర్ల విద్యా అవగాహన నిధి కింద ఎస్‌బీఐ సౌజన్యంతో కార్యక్రమాన్ని చేపట్టారు. విడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వెల్దుర్తి సెంట్రల్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ కేంద్రం ద్వారా కూలీలకు పొదుపు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతాల భద్రత, మోసపూరిత ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఓటీపీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఎవరితోనూ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు.

సైబర్ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ తమ బ్యాంకింగ్ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగినా లేదా మోసానికి గురైనట్లు అనిపించినా వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు.

కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకోవడంతో పాటు సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతులను పాటించడం ద్వారా ఆర్థిక భద్రత సాధించవచ్చని నిర్వాహకులు వివరించారు. సంపాదనతో పాటు భవిష్యత్ అవసరాల కోసం పొదుపు అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ కూలీలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఫైనాన్షియల్ లిటరసీ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language