నార్సింగిలో ఘనంగా తెలంగాణ విమోచన, విశ్వకర్మ జయంతి వేడుకలు
పాపన్నపేట, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీరామ్ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ను కట్ చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తొమ్మిది కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బీకొండ రాములు నేత, మాజీ జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు చంద్రన్న, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సిద్ధిరాములు, జిల్లా నాయకులు ఆకుల సుధాకర్, జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి బుల్లెట్, నార్సింగి బూత్ అధ్యక్షులు చాకలి పెంటయ్య, రామాపురం ఈశ్వర్, చాకలి సాయిలు, ఉప్పరి శ్రీకాంత్ సోలంకి, మహేష్, పాపన్నపేట పట్టణ అధ్యక్షుడు సుంకరి కిష్టయ్య, వెంకట్, సాయి బాబా, మల్లేశం, శంకర్ గౌడ్, సున్నం లక్ష్మణ్, బైండ్ల దుర్గయ్య, బైండ్ల రాజు, వడ్ల చంద్రశేఖర్, తాడేపు శేఖర్, లక్ష్మీనగర్ రమేష్, ఏడుకొండలు, యేసు, కుమార్, విట్టల్, సంతోష్ రెడ్డి, రాజుతో పాటు సుమారు 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొ
న్నారు.


