Type Here to Get Search Results !

మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

 



మోదీ జన్మదినం సందర్భంగా బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

తూప్రాన్, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రెండ్స్): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలోని బంగారమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ మనోహరాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో బంగారమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించి మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని బీజేపీ మనోహరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని బంగారమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రధాని మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకలకు పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టడం, మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం, పేదలు మరియు నిరుపేదలకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నాయకులు తెలిపారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కమ్మరి నరేందర్ చారి, ఎల్. ప్రభాకర్ గౌడ్, మజ్జతి ఆంజనేయులు, నర్సింలు ముదిరాజ్, ఎర్ర కృష్ణ, నారం రాజు, ఆనంద్ యాదవ్, రమేష్, రచ్చ శ్రీకాంత్, పరం నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language