Type Here to Get Search Results !

మహిళలకు స్వయం ఉపాధి బాట.. 9 మందికి కుట్టు మిషన్ల పంపిణీ





 మెదక్ మిల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ


మెదక్, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): మెదక్ మిల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ భారత్ ఫంక్షన్ హాల్‌లో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు పనిలో నైపుణ్యం కలిగి, ఆర్థికంగా వెనుకబడిన 9 మంది అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కుట్టు మిషన్ల ద్వారా మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేద మహిళలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భవిష్యత్తులోనూ పలు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మౌలానా జావేద్ అలీ హుస్సామీ, మహమ్మద్ ఆరిఫ్ హుస్సేన్, సయ్యద్ నసీర్ అహ్మద్ జోహరి, డాక్టర్ ఉమర్ ఖాన్, డాక్టర్ సూఫీ షుజాత్ అలీ, షేక్ ఫజల్ అహ్మద్ అడ్వకేట్, సయ్యద్ గఫార్ అహ్మద్ జోహరి, మజీదుద్దీన్ ముజీబ్, సయ్యద్ సాదత్ అలీ జకీ, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ రియాజుద్దీన్ జర్నలిస్ట్, ఖాజా సిద్దిక్ మొహియుద్దీన్, ఇన్‌స్ట్రక్టర్ అహ్మది బేగం, ఇన్‌చార్జి సానియా సమీరా తదితరులు పాల్గొన్నారు.


– తెలుగు ట్రెండ్స్, మెదక్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language