Type Here to Get Search Results !

సెల్‌ఫోన్ అనుమానం.. ప్రాణం బలి! కర్రలతో దాడి.. రామాంజం మృతి, జలాల్‌పూర్‌లో ఉద్రిక్తత



 సెల్‌ఫోన్ అనుమానం.. ప్రాణం బలి!

కర్రలతో దాడి.. రామాంజం మృతి, జలాల్‌పూర్‌లో ఉద్రిక్తత


వెల్దుర్తి మండలం, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): వెల్దుర్తి మండల పరిధిలోని మన్నేవారి జలాల్‌పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి రామాంజంపై అదే గ్రామానికి చెందిన గుండేని ప్రవీణ్ కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సెల్‌ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతోనే రామాంజంపై దాడి జరిగినట్లు వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం గ్రామంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించిన ప్రవీణ్‌తో పాటు మరికొందరు రాత్రి సమయంలో రామాంజం ఇంటి వద్దకు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం రామాంజంపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామాంజం అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం తన సెల్‌ఫోన్ పోయిందంటూ ప్రవీణ్ వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అనంతరం ఆ సెల్‌ఫోన్ లభించినట్లు తెలిసింది. అయినప్పటికీ రామాంజమే సెల్‌ఫోన్ తీసుకున్నాడనే అనుమానంతో ఆయనపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెల్దుర్తి ఎస్‌ఐ కర్ణాకర్ రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడు రామాంజానికి భార్య రజితతో పాటు తల్లిదండ్రులు సాయిలు, పోచమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.


– తెలుగు ట్రెండ్స్, వెల్దుర్తి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language