కాలికి శస్త్రచికిత్స కోసం రూ.75 వేల ఎల్వోసీ మంజూరు
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ప్రభుత్వ అండ
తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, సెప్టెంబర్ 29: మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన నిజామొద్దీన్కు అనే
వ్యక్తికి కాలికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం నుంచి రూ.75 వేల విలువైన ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎల్వోసీ మంజూరు కావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.కాలికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో చికిత్స కోసం ఎల్వోసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి రూ.75 వేల విలువైన ఎల్వోసీ మంజూరైనట్లు తెలిపారు. ఈ ఆర్థిక సహాయంతో అవసరమైన శస్త్రచికిత్స చేయించుకునేందుకు మార్గం సుగమమైందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాపన్నపేట సర్పంచ్ లింగంపేట పావని నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన వైద్య సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఎల్వోసీ మంజూరుకు సహకరించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సుఫీ, మైనారిటీ మండల అధ్యక్షుడు ఖలీం, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
