Type Here to Get Search Results !

రంగంపేట సొసైటీలో మహాజనసభ రూ.4 కోట్లతో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాం మంజూరు

 రంగంపేట సొసైటీలో మహాజనసభ


రూ.4 కోట్లతో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాం మంజూరు.. రైతులకు ఎరువులు, పురుగుమందులు అందుబాటులోకి

తెలుగు ట్రెండ్స్, కొల్చారం, సెప్టెంబర్ 29: కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక రైతు సహకార సంఘం పరిధిలోని రైతులకు శుభవార్త అందింది. రైతుల సౌకర్యార్థం సుమారు రూ.4 కోట్ల వ్యయంతో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం మంజూరైనట్లు సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తెలిపారు.

మంగళవారం రంగంపేట ప్రాథమిక రైతు సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు అరిగే రమేష్ కుమార్ అధ్యక్షతన మహాజన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సొసైటీ పాలక మండలి డైరెక్టర్లు, రైతులు హాజరయ్యారు. సొసైటీ అభివృద్ధి, రైతులకు అందించాల్సిన సేవలు తదితర పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ అరిగే రమేష్ కుమార్ మాట్లాడుతూ.. పూర్వీకుల కాలం నుంచి సొసైటీకి స్థలం కేటాయించి ఉంచడం వల్ల ప్రస్తుతం 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం మంజూరు అయ్యే అవకాశం కలిగిందని తెలిపారు. గోదాం నిర్మాణంతో రైతులకు పంటల నిల్వకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు.అలాగే ఇకపై రైతుల సౌలభ్యం కోసం సొసైటీ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్లు, పురుగుమందులు (పెస్టిసైడ్స్) అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రైతులు వ్యవసాయ అవసరాల కోసం ఇబ్బందులు పడకుండా సొసైటీ ద్వారా అవసరమైన సామగ్రిని అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.రైతులకు సహకార సంఘం ద్వారా మరిన్ని సేవలు అందించడంతో పాటు సొసైటీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నవీన్ యాదవ్, ఉపాధ్యక్షుడు మోత్కు మల్లేశం, డైరెక్టర్లు లింగన్నగారి ప్రవీణ్ రెడ్డి, ఏర్పుల రమేష్, గోపిగారి దుర్గేష్, లంబడి బుజ్జిబాయి, జనార్దన్ గౌడ్, సాయిలు, జీవయ్య, ఎలుక పాపమ్మ, ఆకుల రమేష్, మంగగారి సంఘమేశ్వర్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రవితేజ రెడ్డి, తుక్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులుతో పాటు రైతులు రవీందర్ గౌడ్, దుర్గేష్, రమేష్, జనార్దన్ రెడ్డి, అల్లు మల్లారెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.



.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language