Type Here to Get Search Results !

అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం.. రూ.5 వేలు అందజేసిన పబ్బ మహేష్ గుప్త

 


మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

సొంత నిధుల నుంచి రూ.5 వేల అందజేసిన తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త

శివ్వంపేట, సెప్టెంబర్ 19 (తెలుగు ట్రెండ్స్):
శివ్వంపేట మండల పరిధిలోని చిన్న గొట్టిముక్కల గ్రామానికి చెందిన వడ్ల సుదర్శన్ చారి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త మృతుని కుటుంబాన్ని పరామర్శించి, తన వంతు సహాయంగా సొంత నిధుల నుంచి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పి, కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావిస్తూ తనవంతు సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహేష్ గుప్త అందించిన ఆర్థిక సహాయానికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు కూడా ఆయన సేవాభావాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరావు, ఉపసర్పంచ్ పాపయ్య చారి, మాజీ సర్పంచ్ బాలామణి, మాజీ ఎంపీటీసీ దశరథ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language