Type Here to Get Search Results !

బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం డాక్టర్‌ మోహన్‌ నాయక్‌ రూ.5 వేల ఆర్థిక సాయం

 


అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆపన్నహస్తం

రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన డాక్టర్‌ మోహన్‌ నాయక్‌.. కుటుంబ సభ్యులకు పరామర్శ

నిజాంపేట, సెప్టెంబర్ 15 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన బొమ్మెన లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మీనాక్షి మోహన్ నాయక్ మంగళవారం చల్మెడ గ్రామానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ మోహన్ నాయక్ తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు ఇలాంటి సమయంలో సహాయం అందించడం మానవత్వానికి నిదర్శనమని గ్రామస్తులు పేర్కొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ మోహన్ నాయక్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్ రెడ్డి, నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, స్వామి, మల్లేష్, నర్సింలు, బాలచందర్, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, సురేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం ద్వారా డాక్టర్ మోహన్ నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామస్తులు అభినందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language