బీవీఆర్ఐటీలో జాతీయస్థాయి సర్వేయింగ్ పోటీలు
పోటీల్లో పాల్గొన్న 27 ఇంజినీరింగ్ కళాశాలలు.. 56 విద్యార్థి బృందాలు
తెలుగు ట్రెండ్స్, నర్సాపూర్: బీవీఆర్ఐటీ కళాశాలలో జాతీయస్థాయి సర్వే-2026 పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 27 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 56 విద్యార్థి బృందాలు పాల్గొంటున్నాయి. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సర్వేయింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.ఈ సందర్భంగా బీవీఆర్ఐటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ.. జాతీయస్థాయి సర్వేయింగ్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరు కావడం సంతోషకరమన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ప్రాక్టికల్‌గా సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయని తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ వెంకటేశ్వరరావు బలుసు, జాకబ్స్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ మాట్లాడుతూ.. సర్వేయింగ్‌లో ఖచ్చితత్వం, నమ్మకం, బాధ్యత అత్యంత కీలకమని అన్నారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాథమిక సర్వేయింగ్ సూత్రాలపై బలమైన పట్టు సాధించాలని సూచించారు.గౌరవ అతిథిగా పాల్గొన్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), గజ్వేల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. మాధవి మాట్లాడుతూ.. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎన్హెచ్ఏఐలో అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను వివరించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు.విద్యార్థులు సర్వేయింగ్ పరికరాలు, ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఫీల్డ్‌లో ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలని సూచించారు. సర్వేయింగ్ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, కళాశాల మేనేజర్ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ తదితరులుపాలుగోన్నారు

