Type Here to Get Search Results !

హారర్, క్రైమ్ థ్రిల్లర్‌గా ‘3 ఫ్లవర్’.. ఆకాష్ పూరి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

 


లక్కీ సినిమా ప్రొడక్షన్‌లో ‘3 ఫ్లవర్’.. ఘనంగా ప్రారంభం

హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా సినిమా పోస్టర్ ఆవిష్కరణ

మెదక్, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
లక్కీ సినిమా ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్–1గా తెరకెక్కనున్న ‘3 ఫ్లవర్’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర పోస్టర్‌ను హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ చిత్రంలో శివాని, అతిధి ముఖర్జీ, పద్మ కథానాయికలుగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు దిల్ రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జబర్దస్త్ చిట్టిబాబు, పొట్టి మామ రాంబాబు, శివం, రాకీ, వివా రెడ్డి, బీజేపీ బాలు, హనమంత్ నాయక్ తదితరులు నటిస్తున్నారు.

మెదక్ జిల్లా శంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన గడ్డం మహిపాల్, ప్రేమ్ నెల్లూరు తదితరులు కూడా ఈ చిత్రంలో భాగస్వాములయ్యారు.

దర్శకుడు అజయ్ AJ మాట్లాడుతూ.. మంచి సందేశాన్ని అందించేలా హారర్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘3 ఫ్లవర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథ, కథనం ఉంటాయని పేర్కొన్నారు.

చిత్రానికి అజయ్ AJ దర్శకత్వం వహిస్తుండగా, సతీష్ ముంజంపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మను TFI డీఓపీగా, శివ సంగీత దర్శకుడిగా, వైరోనెక్స్ పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కుమార్ మెట్టపల్లి, శ్రీనివాస్ మణుగూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా, శ్రీనివాస్ స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా, ప్రభాకర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, రిత్విక్ లైన్ ప్రొడ్యూసర్‌గా, అభినందన్ దర్శకత్వ పరిరక్షణ బాధ్యతల్లో, మధు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా, రమేష్ PROగా వ్యవహరిస్తున్నారు.

చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను నటుడు గడ్డం మహిపాల్ వెల్లడించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language