Type Here to Get Search Results !

ఈనెల 27న ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖో ఎంపికలు.. తూప్రాన్‌లో సెలక్షన్స్

 


ఈనెల 27న ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖో ఎంపికలు

మెదక్, సెప్టెంబర్ 24 (తెలుగు ట్రెండ్స్):
ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఆదివారం సీనియర్ ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

తూప్రాన్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీలో ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులతో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఏర్పాటు చేసి, వచ్చే నెల నల్గొండ జిల్లా హాలియాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలని శ్రీకాంత్ గౌడ్ సూచించారు. ఆసక్తి ఉన్న అర్హులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language