పాపన్నపేట నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
పాపన్నపేట, సెప్టెంబర్ 24 (తెలుగు ట్రెండ్స్):
పాపన్నపేట మండల కేంద్రంలోని ఈశ్వరాలయంలో నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండలి ఆధ్వర్యంలో గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించి, సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో నవయువ సేవా సంఘం సభ్యులు సుంకరి ఆంజనేయులు, విక్రమ్ రాజు, లడ్డు, టప్ప కృష్ణ, వంజరి రాజ్ కుమార్, విట్ట శ్రీనివాస్, రాజేష్, శివశంకర్, పృథ్వీరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
