Type Here to Get Search Results !

పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. విజేతలకు బహుమతులు

 



పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

పాపన్నపేట, సెప్టెంబర్ 24 (తెలుగు ట్రెండ్స్):
జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. నర్సింలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రాధాన్యం, వాలంటీర్లు చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నర్సింలు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించేందుకు ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

బహుమతులు అందుకున్న వారిలో పెద్ద పాపని శంకర్, వై. అర్చన, ముస్కాన్, ఎన్. వైష్ణవి, ఆర్. మనోజ్, ఎం. శివకుమార్, సీహెచ్. అలేఖ్య, ఎస్. ఆర్ష, ఎం. వెన్నెల, షాబోడిన్ ఉన్నారు.

కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జూలకంటి శ్రీనివాస్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language