Type Here to Get Search Results !

గ్రామ పంచాయతీ నిధుల లెక్కలు గ్రామసభలో వెల్లడించాలి: ఘనపూర్‌ హరీష్ నిధుల వినియోగంపై పూర్తి వివరాలు చెప్పాలి.. లేకుంటే తదుపరి కార్యాచరణ

 నిధుల లెక్కలు గ్రామసభలో వెల్లడించాలి


లెక్కలు చెప్పకపోతే తదుపరి కార్యాచరణ చేపడతాం: బీజేపీ మండల అధ్యక్షుడు

 ఘనపూర్ హరీష్


కొల్చారం, అక్టోబర్ 03 (జనం సాక్షి):


గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన పూర్తి లెక్కలను రాబోయే గ్రామసభలో ప్రజల ముందు వెల్లడించాలని బీజేపీ కొల్చారం మండల అధ్యక్షుడు ఘనపూర్ హరీష్ డిమాండ్ చేశారు. కొల్చారం మండలంలోని

నాయిని జలాల్పూర్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు దాసు నరసింహులు సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై వివరాలు కోరిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఘనపూర్ హరీష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు, వాటి ద్వారా చేపట్టిన పనులు, ఖర్చుల వివరాలను గ్రామసభలో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. నిధుల వినియోగంపై లెక్కలు వెల్లడించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

జిల్లా కార్యవర్గ సభ్యుడు దాసు నరసింహులను కించపరిచినంత మాత్రాన ఆయన విలువ ఏమాత్రం తగ్గదని హరీష్ అన్నారు. ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భూమా గౌడ్, గొల్ల కొమురయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, సాదుల స్వప్న ఉషయ్య, యువమోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language