Type Here to Get Search Results !

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సతీష్‌


 నాణ్యమైన విత్తనాల ఎంపికతో అధిక దిగుబడులు

రైతు విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సతీష్‌


నర్సాపూర్, అక్టోబర్ 3 (తెలుగు ట్రెండ్స్): నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సతీష్‌ పేర్కొన్నారు. నర్సాపూర్, శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో శనివారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదికలో నాబార్డ్‌ సహకారంతో విత్తన సహకార సంఘాల బలోపేతంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల ఎంపికతో పాటు KNM-1638 రకం విత్తనాలతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని రైతులకు సూచించారు. విత్తనోత్పత్తిలో పాటించాల్సిన ఎడబాటు దూరం, కల్తీ మొక్కల ఏరివేత, కలుపు నివారణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరి పంటలో వచ్చే కాండం తొలుచు పురుగు, సుడిదోమ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పీఏసీఎస్‌ సంచాలకులు రాజు యాదవ్‌, సహాయ సంచాలకులు శివకుమార్‌ మాట్లాడుతూ రైతులు విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వెంకటస్వామి, మధు, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language