Type Here to Get Search Results !

చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం.. విద్యార్థులకు ఆధునిక అభ్యాసం

 


చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

భాష, గణిత అభ్యాసానికి కృత్రిమ మేధ సాంకేతికత.. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమం

తెలుగు ట్రెండ్స్, చిలిపిచేడ్


, అక్టోబర్ 9:
విద్యార్థుల్లో భాష, గణిత అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఎఫ్ఎల్ఎన్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ప్రత్యేక అధికారి, డీపీఎస్‌ఓ నిత్యానందం మాట్లాడుతూ.. నూతన సాంకేతికతకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఏఐ ఆధారిత అభ్యాస విధానాలు విద్యార్థులకు సులభంగా పాఠాలు నేర్చుకునేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఎంఈఓ విఠల్ మాట్లాడుతూ.. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులు కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్ అభ్యాసం ద్వారా మెరుగైన ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి భాష, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఆధునిక సాంకేతికతను విద్యారంగంలో వినియోగించడం ద్వారా విద్యార్థులకు ఆసక్తికరమైన అభ్యాస అవకాశాలు లభిస్తాయని, వారి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చండూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి, సత్యనారాయణ, అనిత, ఉపసర్పంచ్ అఖిల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పుష్పలత, గ్రామ కార్యదర్శి శోభారాణి, వార్డు సభ్యురాలు బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language