Type Here to Get Search Results !

మెదక్ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు.. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయమాలిని పరిశీలన

 



మెదక్ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు

నిబంధనల అమలుపై అధికారుల పరిశీలన.. అగ్నిమాపక పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: డాక్టర్ జయమాలిని

తెలుగు ట్రెండ్స్, మెదక్, అక్టోబర్ 9: ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయమాలిని సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మెదక్ డివిజన్ పరిధిలోని లైఫ్‌కేర్ నర్సింగ్ హోమ్, సూఫీ, రేన్‌బో ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను అధికారులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఫైర్ ఆడిట్, అగ్నిమాపక పరికరాల రెన్యూవల్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా పరికరాలు అందుబాటులో ఉండటంతో పాటు అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

రేన్‌బో ఆసుపత్రిలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల రెన్యూవల్ చేయించుకోవాలని డాక్టర్ జయమాలిని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించకూడదని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రుల యాజమాన్యాలు అగ్నిమాపక పరికరాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

ఈ తనిఖీల్లో సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ సుశీల్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language