Type Here to Get Search Results !

మనోహరాబాద్‌లో శరన్నవరాత్రి శోభ.. బాల త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం!

 


బాల త్రిపుర సుందరిగా తొలి రోజు అమ్మవారి దర్శనం

మనోహరాబాద్‌ మండలంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

కాళ్లకల్‌ బంగారమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు.. అమ్మవారి దీక్ష స్వీకరించిన సుమారు 150 మంది భక్తులు

తెలుగు ట్రెండ్స్‌, మనోహరాబాద్‌:

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గ్రామాల్లో భక్తిశ్రద్ధలు వెల్లివిరియగా, ఆలయాలు, మండపాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

మండల పరిధిలోని కాళ్లకల్‌ గ్రామంలో బంగారమ్మ ఆలయం వద్ద అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది భక్తులు అమ్మవారి మాలాధారణ స్వీకరించి దీక్షలోకి ప్రవేశించారు. పండితులు వేణు శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలిరోజు బాల త్రిపుర సుందరిగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నవ్య, నాగరాజు గౌడ్‌, ఉపసర్పంచ్‌ ప్రవీణ్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

అదేవిధంగా మనోహరాబాద్‌, పరికిబండ తదితర గ్రామాల్లోనూ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవరాత్రుల ప్రారంభంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఉత్సాహంగా అమ్మవారి దీక్షలు

ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువత గతంతో పోలిస్తే మరింత ఉత్సాహంగా అమ్మవారి మాలాధారణ స్వీకరిస్తూ దీక్షలు చేపడుతున్నారు. భక్తిశ్రద్ధలతో నియమ నిష్ఠలు పాటిస్తూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో భక్తి కార్యక్రమాలు, పూజలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామాల్లో ఐక్యత, సంప్రదాయాలను చాటిచెబుతున్నాయి. రానున్న రోజుల్లో అమ్మవారికి వివిధ అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించనుండటంతో భక్తులు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language