దుర్గామాత సేవలో మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త
కొత్తపేటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జడ్పీటీసీ
తెలుగు ట్రెండ్స్, శివ్వంపేట:
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత అమ్మవారిని మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మహేష్ గుప్త మాట్లాడుతూ ప్రతి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందుతుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం ఉత్సవ నిర్వాహకులు మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ నింగరబోయిన రాములు, శివ్వంపేట సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్, బాసంపల్లి పోచాగౌడ్, కొత్తపేట శ్రీనివాస్ గౌడ్, భవానీ మాత మాలధారులు, గ్రామస్థులు తదితరులు పా
ల్గొన్నారు.
