Type Here to Get Search Results !

తుక్కాపూర్‌లో శ్రీ దుర్గా భవాని కిరాణం జనరల్ స్టోర్ ప్రారంభం.. ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

 




కొల్చారం, అక్టోబర్ 11 (తెలుగు ట్రెండ్స్):

మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవాని కిరాణం జనరల్ స్టోర్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దుకాణాన్ని ప్రారంభించారు.

తుక్కాపూర్ వార్డు సభ్యుడు, కొల్చారం మండల ఎన్‌ఎస్‌యూఐ యువజన అధ్యక్షుడు నవీన్ ఏర్పాటు చేసిన ఈ దుకాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆశీస్సులతో కిరాణం జనరల్ స్టోర్ మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వ్యాపారం విజయవంతంగా సాగుతూ యజమానికి మంచి పేరు, ఆర్థికంగా అభివృద్ధి చేకూర్చాలని కోరుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులోకి రావడంతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులవారి మల్లేశం గౌడ్, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం, రాంపూర్ సర్పంచ్ నెల్లి రాజు, వరిగుంతం మాజీ ఎంపీటీసీ తుడుం రామకృష్ణయ్య, రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ, బండి రమేష్, కొమ్ముల రవీందర్ గౌడ్, యేసు రాజు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language